Wednesday, March 15, 2017

Today's Gold Rate | బంగారం ధర బాగా తగ్గిపోయిందోచ్ | Gold Price Slashed | YOYO TV Channel


Flower

బంగారం ధరలు తగ్గుతున్నాయి! gold prices dropped at 10 months low. #gold prices slipped at the domestic #bullion market on Friday on subdued off-take from stockists and #jewelers coupled with lack of local buying interests as well as weak global cues. #Silver too fell on sustained selling and lack of industrial buying support.

స్టాకిస్టులు, ఆభరణాల వర్తకుల నుంచి డిమాండు క్షీణించడంతో పాటు అంతర్జాతీయ బులియన్‌ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాల కారణంగా బంగారం ధర పది నెలల కనిష్ఠానికి దిగజారింది. 10 గ్రాముల బంగారం ప్రధాన మార్కెట్లన్నింటిటోనూ 28 వేల రూపాయలకు చేరువలో కదలాడుతోంది. అంతర్జాతీయ విపణిలో బంగారం ధర వరుసగా ఐదో రోజు కూడా క్షీణించింది. అమెరికన్‌ డాలరు బలంగా ఉండడంతో పాటు ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లు పెంచుతుందన్న అంచనాలు బులియన్‌ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. అంతర్జాతీయ విపణిలో స్పాట్‌ బంగారం 0.1 శాతం దిగజారి ఔన్సు 1169.51 డాలర్ల వద్ద నిలిచింది. సింగపూర్‌లో 0.15 శాతం దిగజారి 1168.60 డాలర్ల వద్ద ఉంది. వారం మొత్తంలో బంగారం ధర 0.6 శాతం క్షీణించింది. వెండి కూడా 0.2 శాతం క్షీణించి ఔన్సు 16.97 డాలర్లకు చేరింది.

దేశీయ విపణిపై కూడా ఇది ప్రభావం చూపింది. ఢిల్లీలో మేలిమి బంగారం 10 గ్రాములు 130 రూపాయలు దిగజారి 28,580 రూపాయలకు చేరింది. ఆభరణాల బంగారం కూడా 130 రూపాయలు తగ్గి 28,430 రూపాయల వద్ద క్లోజయింది. ఇది పది నెలల కనిష్ఠ స్థాయి. ఫిబ్రవరి తొమ్మిదో తేదీ తర్వాత బంగారం ధరలు ఈ స్థాయికి దిగివచ్చాయి. అయితే వెండి మాత్రం కిలో 250 రూపాయలు పెరిగి 41,850 రూపాయల వద్ద నిలిచింది. డాలర్‌ బలపడడం వల్ల బంగారం జిలుగు తగ్గిందని ట్రేడర్లంటున్నారు. దీనికి తోడు ప్రస్తుతం ప్రజల చేతుల్లో ఖర్చులకు అవసరమైన సొమ్ము అందుబాటులో లేకపోవడం కూడా ఇందుకు కారణమంటున్నారు. ఇక ముంబై మార్కెట్‌లో పది గ్రాముల మేలిమి బంగారం 145 రూపాయలు దిగజారి 28,185 రూపాయల వద్ద ముగియగా ఆభరణాల బంగారం 145 రూపాయలు దిగజారి 28,035 రూపాయలు పలికింది. వెండి కూడా అదే ధోరణి ప్రదర్శిస్తోంది. పారిశ్రామిక డిమాండు లేని కారణంగా కిలో వెండి 185 రూపాయలు దిగజారి 41,565 రూపాయల వద్ద నిలిచింది.

Please watch: "Srimathi Oka Bahumathi Webisode 3 With Etv Prabhakar || YOYO TV Channel" Us at and Share at facebook: watch: "భారతీయులు ఇకపై అమెరికా వెళ్లాలా ? వద్దా ?? | How Safe is the USA for Indians ?? | YOYO TIME TO TALK"



from
http://jarrettboone.blogspot.com/2017/03/todays-gold-rate-gold-price-slashed.html

No comments:

Post a Comment